బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారనుంది తీవ్ర వాయుగుండం. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 17కి.మీ వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం
తుఫాన్ గా మారి రేపు సాయంత్రం కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటుతుందని హెచ్చరికలు జారీ చేసారు వాతావరణ అధికారులు. గోపాల్‌పూర్ (ఒడిశా) కి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ &కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కి తూర్పు-ఈశాన్యంలో 480 కి.మీ.
దూరంలో కొనసాగుతుంది తీవ్ర వాయుగుండం.
అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాని ప్రభావం మొదలైంది. విశాఖలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఉత్తరాంధ్ర,దక్షిణ ఒడిశా జిల్లాలకు ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేశారు. గంటకు గరిష్టంగా 95కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సముద్రంలో అరమీటరు ఎత్తున కెరటాలు విరుచుకుపడే అవకాశం ఉందని… శ్రీకాకుళం, విజయనగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండమని సూచించారు. తుఫాన్ ప్రభావంతో టెలీకాం,విద్యుత్ సేవలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. అలాగే వరి, ఉద్యానవనపంటలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.