NTV Telugu Site icon

Andhra Pradesh: తల్లి ప్రేమంటే ఇదే.. వరదలో చిక్కుకున్న తన పిల్లల కోసం తల్లి కుక్క ఏం చేసిందంటే..!

Dogs

Dogs

ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదు. ఆత్మీయత, అనురాగం, అనుబంధం.. వీటిని మించి అమ్మ ప్రేమలో ఉంటుంది. బిడ్డలపై చూపించే అమ్మ ప్రేమకు మరొకటి సరితూగదు. తన కోసం కాకుండా తన పిల్లల కోసం సర్వస్వం చేస్తుంది. తాను తినకపోయిన తన పిల్లలకు తినిపించాలనే స్వభావం అమ్మ ప్రేమలో ఉంటుంది. అయితే అమ్మ ప్రేమ అనేది.. కేవలం మనుషుల్లోనే కాదు.. అన్నీ జీవుల్లో కూడా అలానే ఉంటుంది. అయితే మాతృప్రేమను చాటిన ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క తల్లడిల్లిపోయింది. అయితే చివరకు ఏపీ పోలీసుల సాయంతో తన పిల్లలను క్షేమంగా దక్కించుకోగలిగింది.

R.Narayana Murthy : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయి

ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. అయితే అందులో ఓ కుక్క పిల్లలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. తన పిల్లలను కాపాడుకునేందుకు ఏం చేయాలో తల్లి కుక్కకు అర్థం కాలేదు. కానీ కన్న ప్రేమతో.. ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంతలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు అక్కడే ఉన్నారు. వారి దగ్గరికి వెళ్లి వారి చుట్టూ తిరగసాగింది. అయితే కుక్క పదే పదే వారి వెంటే తిరుగుతుండటంతో.. పోలీసులు అటుగా దృష్టిసారించారు. ఈ క్రమంలోనే కుక్క ఎందుకు ఇలా ఎందుకు చేస్తుందనే కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఆసక్తిగా కనబరిచారు.

Miss Shetty Mr Polishetty : క్రేజీ మూవీ సరి కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలుసా..?

బాధలో ఉన్న కుక్క తీసుకెళ్లిన మార్గంలో పోలీసులు వెళ్లారు. చివరకు నీటిలో మునిగిన ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇంట్లో కుక్క యజమాని ఉండొచ్చని భావించారు. అయితే అక్కడ రెండు కుక్క పిల్లలు కనిపించాయి. దీంతో ఆ కుక్క ఎందుకోసం ఆవేదన చేదిందనేది పోలీసులకు తెలిసింది. వెంటనే చిన్న పిల్లలను కుక్క వద్దకు చేర్చారు. అంతేకాకుండా బురదలో చిక్కుకున్న వాటికి శుభ్రమైన నీళ్లతో కడిగి తల్లి వద్ద వదిలేశారు. తన పిల్లలను కాపాడిన పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది తల్లి కుక్క.

ABHB: ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం

దీనికి సంబంధించిన వీడియోను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కుక్క పిల్లలను కాపాడిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జంతువుల పట్ల విజయవాడ నగర పోలీసులు మానవత్వంతో వ్యవహరించినందుకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందనలు తెలిపారు.