Site icon NTV Telugu

Sailajanath: ఇంకా ఎన్నిసార్లు బీజేపీ చేతిలో మోసపోతారు..!

Sailajanath

Sailajanath

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు.. ఇక, మంగళవారం ఏపీ వచ్చిన ఆమె.. తనకు ఓటు వేయాల్సింది కోరుతూ ప్రచారం నిర్వహించారు.. అయితే, వైసీపీ, టీడీపీపై మండిపడుతోంది కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపి చేతిలో ఇంకా ఎన్నిసార్లు మోసపోతారని నిలదీశారు పీసీసీ చీఫ్‌ శైలజానాథ్.. ఏపీలో వరదలకు సహాయం పొందలేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట సీఎం జగన్‌ నోటి నుంచి రాలేదని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నది సీఎం హోదా ఎంజాయ్ చేయడానికో, సొంత విషయాలు మాట్లాడుకోవడానికో కాదని హితవుపలికారు.

Read Also: Robbery in Kukatpally: వాచ్‌మెన్‌గా చేరాడు.. రూ.. 55 ల‌క్ష‌ల సొత్తుతో ప‌రార్ అయ్యాడు

ఇక, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడకుండానే ఎగబడి ఎన్డీఎ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని జగన్, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు శైలజానాథ్.. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారన్న ఆయన.. చంద్రబాబు ఎన్నిసార్లు బీజేపి చేతిలో మోసపోతారని అడుగుతున్నాను.. తమ అసమర్థతకు, భయానికి సామాజిక న్యాయం అనే ట్యాగును చంద్రబాబు, జగన్ వేస్తున్నారని మండిపడ్డారు.. విమానాశ్రయంలో గేటు కు ఒక వైపు వైసీపీ నేతలు, మరో వైపు టీడీపీ నేతలు పోటీపడి మద్దతు, స్వాగతం పలికాదని ఎద్దేవా చేశారు. బీజేపీకి దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోలేని సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్ లో ఉందని.. 175 మంది శాసన సభ్యులు, 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఏపీ నుంచి ఉందన్నారు శైలజానాథ్‌.

Exit mobile version