Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన..! లాజిక్‌ చెప్పిన మంత్రి..

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూనే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గుడివాడ అమర్‌నాథ్… తాడేపల్లిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… అసలు పవన్‌ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాడో..? లేదో..? చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఇక, పవన్ కళ్యాణ్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన పార్టీ అంటూ ఎద్దేవా చేశారు… రాష్ట్రంలో కాపులెవరూ పవన్ కల్యాణ్‌ను నమ్మటం లేదన్న ఆయన.. పవన్‌ కల్యాణ్‌కు స్క్రిప్ట్, ప్రొడక్షన్ నారా చంద్రబాబు నాయుడుది.. డైరెక్షన్ పక్కన ఉండే నాదెండ్ల మనోహర్‌ది అని.. ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది కదా..! అది కమ్మ జనసేన అని అంటూ హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి అమర్‌నాథ్.

Read Also: Minister Gudivada Amarnath: బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే లోకేష్‌కు మైండ్ లాస్ అయినట్టుంది..!

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ప్రతిపక్షాలను విమర్శిస్తున్న సమయంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతలు ఎవరైనా.. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తెచ్చారంటే.. ఆ వెంటనే పవన్‌ కల్యాణ్‌పై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ విమర్శిస్తున్నారు.. ఇక, వారిపై అదే స్థాయిలో సమయం దొరికినప్పుడుల్లా కౌంటర్‌ ఎటాక్‌ చేస్తూనే ఉన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. మొత్తంగా.. పవన్‌ కల్యాణ్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ మంత్రి అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.

Exit mobile version