NTV Telugu Site icon

Dharmana Prasada Rao: అవినీతి నాకు నచ్చదు.. ఎక్కడైనా నయాపైసా తీసుకున్నాడని చెప్పగలరా..?

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

రాష్ర్టం మొత్తంలో ఎక్కడైనా నయాపైసా ధర్మాన ప్రసాద్‌ తీసుకున్నాడని చెప్పగలరా..? అని సవాల్‌ విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కల్లేపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కోట్లాది రుపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక, కేసులు విచారణకు రాకుండా స్టేలు తీసుకువస్తుంటాడు అని ఆరోపించారు.. మరోవైపు, నన్ను గెలిపించే ప్రజలు తలదించుకునేలా ఎప్పుడూ పనిచేయన్న ఆయన.. అవినీతి అంటే నాకు నచ్చదు, ఉద్యోగులు అవినితికి దురంగా‌ఉండాలని సూచించారు.. పార్టీలో నేతలు ‌కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం, చెడిపోయి ఉన్నాం.. కానీ, ఎక్కడా అవినితి చేయడం లేదన్నారు.. వ్యవస్థలో అవినీతిలేని మార్పు రావాలి, ఆ ప్రయత్నం నేడు జరుగుతుందన్నారు.. సీఎం జగన్‌కు పిచ్చి , క్రాక్ , ఏం తెలిదని మాటాడుతున్నారు.. అసలు, మార్పు తీసుకురావాలని ప్రయత్నించే జగన్ లాంటి వారు కఠినంగా ఉంటారని.. కఠినంగా ఉన్న జగన్ లాంటి వారిని ఇలాంటి మాటలు అంటారని మండిపడ్డారు ధర్మాన.

Read Also: CP Mahesh Bhagwat: ఇంటర్నేషనల్.. ఇంటర్‌స్టేట్ డ్రగ్ రాకెట్స్‌ని పట్టుకున్నాం

టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ధర్మాన ప్రసాదరావు.. చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటాడు, ఈ రాష్ర్టం గురించి మాట్లాడుతాడు.. రేపు అధికారంలోకి రాకపోయినా హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండిపోతారని జోస్యం చెప్పారు.. ఇక, చంద్రబాబు టైంలో బ్రోకర్ల వ్యవస్థ ఉండేది, ప్రతీ పనికి డబ్బు పంచుకునేవారు.. కానీ, నేడు నయాపైసా తినటం లేదు, ప్రజలు కూడా వైసీపీ వారు డబ్బు తినటం లేదని అంటున్నారని తెలిపారు.. అభివృద్ధి అంటే ఏంటి టీడీపీ వారు చెప్పాలి..? అని సవాల్‌ విసిరిన ఆయన.. లేదా టీడీపీ వారు ఎవరైనా రండి నేను చెబుతాను అభివృద్ది ఏంటో అన్నారు. ఇక, ఇన్ని సంవత్సరాలలో విజయవాడలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించారు ధర్మాన.. ప్రక్కరాష్ర్టంలో ఉన్నోడు.. ఈ రాష్ర్టం గూర్చి ఏం మాటాడతాడు? అని నిలదీశారు. సుఖమైన వ్యాపారం, పద్ధతి అంతా బాబుకి హైదరాబాద్‌లోనే ఉంటాయి.. హైదరాబాద్ లో ఉండి టీవీల్లో , జూమ్ మీటింగ్ లలో మాటాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ర్టం గూర్చి చాలా ఆలోచిస్తాం‌ అని చెబుతాఉంటాడు.. అయన హాయాంలో ఏం చెశారు? అని ఫైర్‌ అయ్యారు.

ఇక, ధాన్యం పండించిన వాడికి సుఖం లేదు.. వరి పంట మాని వెరేపంట వెసుకొవాలని రైతులకు మేమే విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు మంత్రి ధర్మాన.. ధాన్యం ధర ఎవరు నిర్ణయిస్తారు జగన్ మోహన్ రెడ్డినా? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది.. కానీ, ఈ టీడీపీ వారికి ఏం తెలుస్తుంది, పోరంబోకుల్లా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. ముడున్నర ఏండ్లలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని అని సూచించారు. సంవత్సరానికి ఒక కుటుంబానికి లక్షవరకూ వస్తుంది.. ప్రజల పన్ను డబ్బులు అవసరమైన పేదలకు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం అన్నారు.. సెక్రటేరియట్ సిబ్బంది, వాలంటీర్లు జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.