Rachakonda CP Mahesh Bhagwat Reveals Drug Rackets Details: హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ & అంతర్‌రాష్ట్ర డ్రగ్ రాకెట్స్ గుట్టు రట్టు చేసిన నేపథ్యంలో.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆ వివరాల్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యూ ఇయర్ సెలబ్రేష్స్ సందర్భంగా డ్రగ్స్ మీద ఎక్కువ తనిఖీలు చేస్తున్నామని.. ఈ నేపథ్యంలోనే ఇంటర్నేషనల్, ఇంటర్‌స్టేట్ డ్రగ్ రాకెట్స్‌ని పట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ కేసులో భాగంగా ఒక నైజీరియన్‌ని, సాయికృష్ణ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ ఇద్దరి వద్ద నుంచి 30 గ్రాముల మెటాపెతమన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నైజీరియన్‌కి నేర చరిత్ర ఉందని.. 2017లో పూణేలో డ్రగ్స్ కేసులో ఒక సంవత్సరం జైలుకి కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. తన వీసా గడువు పూర్తైనప్పటికీ.. దొంగచాటుగా నైజీరియన్ ఇక్కడే ఉన్నట్టు తాము గుర్తించామన్నారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్, నెరేడ్‌మెట్ పోలీసులు కలిసి.. ఈ డ్రగ్ రాకెట్‌పై దాడి చేశారన్నారు.
Srinivas Goud: పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యం చేస్తే వదిలే ప్రసక్తే లేదు
ఇక ఇంటర్‌స్టేట్ డ్రగ్ రాకెట్ గురించి మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు పెడ్లర్స్, కన్స్యూమర్‌ని పట్టుకున్నట్టు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 45 గ్రాండ్ హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ప్రవీణ్ కుమార్ ప్రధాన నిందితుడని చెప్పారు. నిందితులు రాజస్థాన్‌కి చెందిన వారని.. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో వీళ్లు పని చేస్తున్నారని వెల్లడించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ రాకెట్ పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ. 35 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కిలో హేరోయిన్ రూ.5 కోట్ల పైనే ఉందన్నారు. మన దేశంలో నార్కోటిక్ పదార్థాలు చట్టవిరుద్ధమని, ఈ కేసులో నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామని.. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
Shalini Kidnap Case: శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతికి ఆల్రెడీ పెళ్లి