రోనా మహమ్మారి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించితీరుతామని ఇప్పటికే పలు సార్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.. తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై స్పందించిన మంత్రి.. పరీక్షలను రద్దు చేయడానికి ఒక్క నిమిషం చాలు.. కానీ, ఆ తర్వాత పర్యావసనాలను కూడా గుర్తించాలన్నారు.. ఇక, జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్న మంత్రి సురేష్.. జులై చివరి వారంలో టెన్త్ పరీక్షలు ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించడంపై పరీశీలన చేయనున్నట్టు గతంలోనే పలు సందర్భాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.