ఇక క్షేత్రస్థాయి పర్యటనలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు, దిశా యాప్, వ్యవసాయం, అక్టోబరులో నెలలో అమలు చేయనున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు.
ఇక, ఇళ్లపట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్.. గత వీడియో కాన్ఫరెన్స్‌లో 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి 758కి కేసులు తగ్గాయని.. 76 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.. దాదాపుగా 8వేల మందికి దీనివల్ల మేలు జరిగిందన్న సీఎం.. ఏజీతో నేను కూడా రెగ్యులర్‌గా మాట్లాడుతున్నానని.. ఈ కేసులు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలిన అడిగినట్టు వెల్లడించారు.. వచ్చే నెలరోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా అన్నారు. లే అవుట్ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామన్న ఆయన.. మిగిలిపోయిన 12.6శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. 1980 నుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా అవకాశం ఇస్తున్నాం.. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయన్నారు.. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15. 6 లక్షల ఇళ్లు కడుతున్నాం.. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్అయ్యాయని.. ఆప్షన్ –3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని.. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు.
Also Read
- AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
- Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
- OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!
- OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
-
Poojitha Ponnada: AK47లో ఫుల్ లెంగ్త్ రోల్ అని పిలిచి.. సైలెంట్‌గా వేరే హీరోయిన్ను పెట్టేశారు!
-
Tollywood: మన దర్శకులకు ఏమైంది?
-
Imran: ‘మేము బిచ్చగాళ్లం కాదు’.. ఎస్పీ సీట్ల ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్..
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!