Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- ఎండల తీవ్రతతో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు క్షీణం
- శస్త్రచికిత్సలు పెరగడంతో రక్తానికి భారీ డిమాండ్
- నెగిటివ్ బ్లడ్ గ్రూపుల కొరతతో అత్యవసర పరిస్థితి
- స్వచ్ఛంద రక్తదానానికి వైద్యుల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కేవలం ప్రజల జీవనశైలినే కాదు, ప్రాణరక్షణ వ్యవస్థలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ప్రస్తుతం వేగంగా తగ్గిపోతున్నాయి. సాధారణంగా మే, జూన్ నెలల్లో తలెత్తే ఈ రక్త కొరత సమస్య, ఈ ఏడాది మార్చి నెల నుంచే ప్రారంభం కావడం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత పెరగడంతో రక్తదాతలు బయటకు వచ్చి రక్తం ఇచ్చేందుకు వెనకడుగు వేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమవుతోంది.
వేసవి సెలవుల కారణంగా ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలు (Planned Surgeries) ఈ సమయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. దీనివల్ల సాధారణం కంటే అదనంగా సుమారు 100 యూనిట్ల రక్తం అవసరమవుతోంది. ఒకప్పుడు రోజుకు 400 యూనిట్లకు పైగా రక్తాన్ని సరఫరా చేసిన బ్లడ్ బ్యాంకులు, ప్రస్తుతం కేవలం 30 నుంచి 40 యూనిట్లు మాత్రమే అందించగలిగే స్థితికి చేరుకున్నాయి. గతంలో రోజుకు 15 యూనిట్ల వరకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న బ్లడ్ బ్యాంకులు కూడా, గత వారం రోజులుగా కేవలం 5 నుంచి 6 యూనిట్లకు మించి ఇవ్వలేకపోతున్నాయి.
Also Read
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- YS Jagan: 'నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి'.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
రక్త నిల్వల క్షీణతలో ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల కొరత అత్యంత క్లిష్టంగా మారింది. అందుబాటులో ఉన్న ప్రతి 100 బ్లడ్ ప్యాకెట్లలో కేవలం 10 మాత్రమే నెగిటివ్ గ్రూపులు ఉంటున్నాయి, ఇది తలసీమియా , హృద్రోగులకు పెద్ద సమస్యగా పరిణమించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి నెలకు సుమారు 500 యూనిట్ల రక్తం అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడేందుకు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
-
NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!