NTV Telugu Site icon

Tammineni Sitaram : టీడీపీ అంపశయ్యపై ఉంది.. వెంటిలేటర్ తీసేడయమే మిగిలింది..!

Tammineni Sitaram

Tammineni Sitaram

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేస్తున్నది అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ అంపశయ్యమీద ఉంది.. వెంటిలేటర్ తీసేయడమే మిగిలిందంటూ వ్యాఖ్యానించారు.. ఎన్టీ రామారావును వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్‌ విగ్రహాలను ముట్టుకునే అర్హతలేదని ఫైర్‌ అయ్యారు.. ప్రజల కలలోకి వచ్చి ఎన్టీఆర్‌ ఆత్మే చంద్రబాబు దుర్మార్గాలు చెబుతుందన్నారు.. ఇక, చంద్రబాబులో నిరాశ, నిస్ప్రహ పెరిగింది.. పోటీకి ముందే ఆటలో ఓడిపోయినట్టు అర్ధమైందని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు అధికారమనే మానసికరోగంతో బాధపడుతున్నారన్న ఆయన.. ప్రజా జీవితంలో ఛాలెంజ్ లు చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు.. చరిత్ర తిరిగేసుకుంటే అర్ధం అవుతుందన్నారు.

Read Also: Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో కూలీ పోటీ.. 10 వేల రూపాయి నాణేలతో డిపాజిట్

ఇక, ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా నీచానికి దిగజారతారు అంటూ చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు తమ్మినేని సీతారం.. దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నాను.. తిరుపతిలో నాయి బ్రహ్మలను అవమానిస్తే చంద్రబాబుకు ఏకంగా గుండే కొట్టేశారన్నారు.. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి తాను అవమానించిన వర్గాల కాళ్లు పట్టు కోవడానికి వెనుకాడరన్న ఆయన.. జగన్ అధికారంలోకి వస్తారని చంద్రబాబు ఊహించ లేదు.. మరోసారి ఓడిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వైఎస్‌ జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిన్నాయి.. అయినా, జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదన్న ఆయన.. చంద్రబాబుకు మహిళల నుంచే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. జగన్, జనం కలిసే వున్నారు.. అసహనం తగ్గించుకోకపోతే నష్టం పెరుగుతుందని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. కర్నూలులో ఎదురైన పరిణామాలు లాంటివి భవిష్యత్ లో చాలా జరుగుతాయన్న ఆయన.. శివరామకృష్ణ కమిటీ సూచనలు ఆధారంగానే మూడు రాజధానుల నిర్ణయమని స్పష్టం చేశారు. విశాఖ ప్రపంచ నగరం.. ఈ సిటీని రాజధానిగా అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి..? అని నిలదీశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.