Site icon NTV Telugu

Driver Subramanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య పాత్ర..

Mlc Anantha Babu

Mlc Anantha Babu

Driver Subramanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె కూడా పాల్గొన్నారని, ఆధారాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి సిట్ బృందం తీసుకు వచ్చింది. ఈ కేసులో ఆమెను ఏ-2గా పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సిట్ బృందం అడిషనల్ చార్జిషీట్ దాఖలు చేసింది. 2022 మే 19వ తేదీన సుబ్రహ్మణ్యం హత్య జరిగింది, అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంత బాబు అప్పగించారు. సీసీ ఫుటేజ్, కాల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలను సేకరించామని సిట్ టీమ్ పేర్కొంది.

Read Also: Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!

అయితే, గత ఏడాది సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు జూలైలో తదుపరి విచారణ కోసం సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్‌పై ఉన్నారు. గతంలో అనంత బాబు భార్యను విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో లక్ష్మీ దుర్గ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం లక్ష్మీ దుర్గ పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అనంత బాబు గన్‌మెన్లు, అనుచరులను సిట్ బృందం విచారించింది.

Exit mobile version