Thopudurthi Bhaskar Reddy: వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి..

  • వైసీపీ సీనియర్‌ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత..
  • పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి పడిపోయిన భాస్కర్‌ రెడ్డి..
  • ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యుల నిర్ధారణ..
Thopudurthi Bhaskar Reddy

Thopudurthi Bhaskar Reddy

Thopudurthi Bhaskar Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి కింద పడిపోయిన భాస్కర్‌ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే భాస్కర్‌ రెడ్డి మృతిచెందినట్టుగా నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియ‌ర్ నాయ‌కుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు వైఎస్‌ జగన్‌.. క్రమ‌శిక్షణ క‌లిగిన నాయ‌కుడిగా పార్టీకి ఆయ‌న అందించిన సేవ‌లు మ‌రిచిపోలేనివి అని పేర్కొన్నారు.. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్రసాదించాలి.. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు వైఎస్‌ జగన్‌ .. ఇక, తన చిన్నాన్న తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి.. అనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి.. భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు..