YS Jagan: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం.. ఫర్నిచర్ పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతికంగా దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుంది..
పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. కొంత మంది పోలీసులు చంద్రబాబు రాజకీయ ఎజెండా కోసం పని చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని మాజీ సీఎం జగన్ అన్నారు.
Read Also: e-Scooters: సింగిల్ ఛార్జ్ తో.. వందల కి.మీల దూరం ప్రయాణించే బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే
ఇక, చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు, అల్లరి మూకలకు ధైర్యం వస్తోంది అని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను అణిచి వేయడానికి ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇది వైసీపీపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు.
