Gorantla Madhav: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. రాష్ట్రంలో అలజడలు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు..
Read Also: Earthquake: చెన్నైలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు
కాగా, తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడంపై గురువారం రోజు స్పందించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని పెట్టిన కేసు ఇది.. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతా.. మాట్లాడే హక్కును, భావ ప్రకటన స్వేఛ్చాను ఈ ప్రభుత్వం హరిస్తోంది.. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే.. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మీరు చేస్తున్నవి గుర్తు పెట్టుకోండి.. మార్చి 5వ తేదీన నా లీగల్ అడ్వయిజరీతో కలిసి పీఎస్ కి వెళ్లి విచారణకు సహకరిస్తా.. మార్చి 5న నాకు ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే విచారణకు హాజరవుతాను అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించిన విషయం విదితమే..