Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్‌ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..

Thopudurthi Prakash Reddy V

Thopudurthi Prakash Reddy V

Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అద్దెకు నివసిస్తున్న ఇంటిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ నెల 7వ తేదీన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కలమాడి రుక్మిణి ఇంటిని కొనుగోలు చేశారట ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు .. ఐదు సంవత్సరాలుగా అద్దె కట్టకుండా వైసీపీ కార్యకర్తకు చెందిన శ్రీనివాస్ ఇంట్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్నాడనే ఆరోపణలు ఉండగా.. రెండు కోట్ల 85 లక్షల రూపాయలకు ఆ ఇల్లు కొనుగోలు చేస్తున్నట్లు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటిని అగ్రిమెంట్ చేసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ..

ఇక, ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు తనపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు .. ఐదు గంటలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటి వద్దకే వెళ్తానని ప్రకటించారు.. అయితే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని తోపుదుర్తికి షాక్‌ ఇచ్చారు ఎంఎస్ రాజు.. మరోవైపు.. ఎంఎస్ రాజు మాట్లాడుతూ, తనపై తోపుదుర్తి చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే తాను తోపుదుర్తి నివాసానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది.

ఇదే సమయంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. మంత్రి నారా లోకేష్‌పై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

మరోవైపు.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కూడా స్పందించారు. ఎస్‌ఆర్‌సీ కంపెనీ టిప్పర్ వాహనం, తోపుదుర్తి వాహనం ఒకేసారి రావడం యాదృచ్ఛికమని ఆయన తెలిపారు. దీనిని హత్యాయత్నంగా చిత్రీకరించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. ఆస్తులు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి హక్కేనని, సామాజిక వర్గాల వారికీ ఆస్తులు ఉండకూడదనే భావన సరైంది కాదని వ్యాఖ్యానించారు.