JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు.. నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి మైకులు కూడా లాక్కున్నారు.. ఇవన్నీ చంద్రబాబు మర్చిపోయాడు, రివెంజ్ తీసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదు.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చీము-నెత్తురు లేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకవైపు మేము వస్తే.. టీడీపీ వాళ్ళను ఊరు విడిపిస్తామని అంటున్నా, కనీసం రాష్ట్రంలో టీడీపీ నాయకులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Suhas: అంబాజీపేట హీరోయిన్ తో మరో సినిమా
అయితే, వైఎస్ఆర్సీపీ నాయకులను ఉతికి ఆరేయండి అని టీడీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాష్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిలపై ఫైర్ అయ్యారు. పేర్ని నాని నీ భార్యను తిట్టారని అంటున్నావు.. మరి నా భార్య, కోడలుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించలేదా! అని ప్రశ్నించారు. చంద్రబాబు మాకు అండగా లేడు.. గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయకూడదని ఆయన ఆలోచన చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్
ఇక, చంద్రబాబు ఒక 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి, ఎవరు ఏం మాట్లాడతారో చూస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లను గత ఐదేళ్లు చెడగొట్టి పోయారు, వాటిని సీఎం సరి చేస్తున్నాడు అన్నారు. పేర్ని నాని పేదల బియ్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించావు నువ్వా మాట్లాడేది అని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాడు, టీడీపీ వాళ్లకు అండగా లేడు అని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా గెలిచి మీకు అండగా నిలిచాడు లేకపోతే మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని జేసీ ప్రభాకర్ అన్నారు.
