సుహాస్ సైలెంట్‌గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన, మరోసారి కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. తనతో కలిసి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాలో నటించిన శివాని హీరోయిన్‌గా నటిస్తున్న సరికొత్త సినిమా ఈ రోజు లాంచ్ అయింది.
Also Read:Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ సినిమా అని చెబుతున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాతో ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు కథ అందించగా, గోపి అక్షర దర్శకుడిగా మారారు.
Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు!
ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు నాగశ్వరం, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగశ్వరం క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నట్లు వెల్లడించారు. మహి రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ నైషధం ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.