NTV Telugu Site icon

Man Married Minor Girl: అరేయ్ ఏంట్రా ఇది..? ఏపీలో మైనర్‌ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..

Minor Girl

Minor Girl

Man Married Minor Girl: సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్‌ మందలించారు.. దీంతో.. పబ్లిక్‌గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కొంతకాలంగా ఎనిమిదో తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలిక వెంటపడ్డాడు శ్రీకాంత్ (24) అనే యువకుడు.. ఏం జరిగిందో కానీ, మొత్తంగా ఆ బాలిక కూడా ఆ యువకుడి ట్రాక్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.. వీరి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.. ఈ వ్యవహారం కాస్తా కుటుంబసభ్యుల వరకు వెళ్లింది.. శ్రీకాంత్ ప్రేమకు అడ్డుచెప్పారు పెద్దలు.. పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ పెట్టారు.. దీంతో, బాలిక ఇంటికి వెళ్లిన శ్రీశాంత్.. పబ్లిక్‌గానే ఆ బాలిక మెడలో తాళికట్టేశాడు.. ఆ బాలిక నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి గానీ.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియాలో.. తాళి కట్టిన తర్వాత ఇక.. ఏమైనా చేసుకో.. పబ్లిక్‌గా తిరిగినా అభ్యంతరం లేదు అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి… మొత్తంగా మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.

Show comments