Botsa Satyanarayana: అనకాపల్లి జిల్లాలోని రాజయ్య పేట మత్స్యకారుల సమస్యలను వైసీపీ నేతలు విన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయించాలని బొత్స సత్యనారాయణ ముందు మత్స్యకార మహిళలు కంట తడిపెడుతున్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల వల్ల ప్రశాంతత కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని మత్య్సకారులు కోరారు. ఇక, శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే రాజయ్య పేటకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారని తెలిపారు. మత్స్యకారులకు సంఘీభావంగా మేం నిలబడతాం.. యావత్ పార్టీ మీ వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా?.. ఎందుకీ నిర్బంధం అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారుల పోరాటానికి వైసీపీ అండగా నిలబడుతుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామన్నారు. హోంమంత్రి అనితకు చేతకాకపోతే రాజకీయాలు మానుకో అని మండిపడ్డారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి సాక్షిగా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదు అన్నారు. రాజయ్యపేట గ్రామస్తుల అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Story of Satish Prasad Singh: ఐదు రోజుల సీఎం.. బీహార్ తొలి ఓబీసీ ముఖ్యమంత్రి కథ..!
అలాగే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు లెక్చర్లు ఇచ్చిన అనిత ఏమైపోయారు?.. క్యాన్సర్లు వస్తాయని., బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామని చేసిన ప్రకటనలు ఏమయ్యాయి.. అనితను గెలిపించినందుకు ప్రజలు లెంపలు వేసుకుంటున్నారు.. ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి 2029లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎత్తేస్తాం.. చంద్రబాబు పెద్దల పక్షం.. జగన్ పేదల పక్షం అన్నారు. ఇక, మాజీమంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ కు వైసీపీ వ్యతిరేకం.. జగన్మోహన్ రెడ్డి మాటగా మాది హామీ.. మేం రాజకీయాలు చేయడానికి రాలేదు.. సమస్య పరిష్కారం కోసం సంఘీభావం తెలిపాం.. గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డు అడుగుతున్నారు.. కొన్ని రోజులు పోతే పాస్ పోర్టులు కూడా అడుగుతారు.. వందల ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న ప్రజలు ఈ దేశం, రాష్ట్రానికి చెందిన వాళ్ళ లేక పొరుగు దేశం వాళ్ళా? అని ప్రశ్నించారు.
Read Also: Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. హోంమంత్రి అనిత నమ్మించి మోసం చేసింది.. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.. మా ఊరి ఆడపిల్ల అని నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాం.. మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు జగన్ నే న్యాయం చేయాలి.. కూటమి ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగదు.. బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.. ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.. మా ప్రాణాల పోయినా పర్వాలేదు.. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వమని స్థానికులు పేర్కొన్నారు.
