Site icon NTV Telugu

Kothapalli Geetha: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొత్తపల్లి గీత..

Geeta

Geeta

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ముల్లేరు గ్రామంలో ప్రచార రథం నుండి ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. గ్రామంలో రాములవారి గుడి ఆవరణలో మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అనకాపల్లిలో సోమవారం జరిగిన ప్రధాని బహిరగసభ వేదికపై ప్రధాని నరేంద్రమోడీ తన గెలుపుకు మద్దతుగా తలపై చేయిపెట్టి మనస్పూర్తిగా ఆశీర్వదించారని అన్నారు.

Sivangi: ఆనంది, వరలక్ష్మితో ‘సివంగి’.. దర్శకుడిగా మారుతున్న సినిమాటోగ్రఫర్!

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిండుసభలో తనను దీవించారని.. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారనీ ఆరోపించారు. ప్రతి చోటా లాగే రంపచోడవరంలో కూడా గంజాయి రాజ్యమేలుతుందనీ.. గిరిజనుల మీద నిందలేస్తూ పెద్దలు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారనీ విమర్శలు చేశారు. త్వరలోనే రంపచోడవరం ఏరియాలో పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే బ్యాలెట్ లో వరుస సంఖ్య 3 రావడం జరిగిందని.. త్రిశూలం వలే మూడు పార్టీలు కలిశాయని.. ఓటర్లంతా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయానికి పాటుపడి కూటమికి ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు.

PM Modi: ఏపీకి మరోసారి మోడీ.. బుధవారం షెడ్యూల్ ఇదే

Exit mobile version