Site icon NTV Telugu

Minister Anitha: నేను సీఎం చంద్రబాబుకి ఏకలవ్య శిష్యురాలిని..

Anitha

Anitha

Minister Anitha: అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయ దగ్గర ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేసింది హోం మంత్రి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి, భోజనాలు ఒడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్.. చంద్రబాబు హాయాంలో మేము పని చేయడం పూర్వజన్మసుకృతం.. భావితరాల భవిష్యత్ కోసం అలు పెరుగని పోరాటం చేస్తున్న యోధుడు అని మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చింది.

Read Also: Chandrababu Success Story: సీఎం చంద్రబాబు సక్సెస్ స్టోరీ..

ఇక, నేను చంద్రబాబుకి ఏక లవ్య శిష్యురాలిని అంటూ హోంమంత్రి అనిత తెలిపింది. ఆయనను చూసి నేను నేర్చుకున్నాను.. రాబోయే తరానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకం.. ఆంధ్రప్రదేశ్ ను 2047కు అగ్రగామిగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. బంగారు కుటుంబంతో ప్రజలతో ఎంతో మంచి చేస్తున్నారు.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు.. ప్రతిపక్షనేతగా కూడా ప్రజలకు అండగా ఉన్నారు.. విపత్తుల సమయంలో కూడా ప్రజలకు తోడుగా ఉన్నారు.. హుద్ హుద్ సమయంలో కూడా ఎంతో కృషి చేశారు అని వంగలపూడి అనిత తెలిపింది.

Exit mobile version