Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు అనకాపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతం అయింది. హోంశాఖ మంత్రితో చర్చలు విఫలం అవ్వడంతో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. దీంతో హోం మంత్రి అనిత కాన్వాయ్ నీ ఆపేందుకు రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు.
Read Also: Kantara 1 : రిషబ్ శెట్టిపై తెలుగు యువత ఆగ్రహం.. ఇంత చిన్న చూపా..?
మరోవైపు, బల్క్ డ్రగ్ పార్క్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు ఆందోళన చేయడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. రాజయ్య పేట పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చేయకుండా ఆమె ఒప్పించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇక, పోలీసు భద్రత మధ్య సంఘటన స్థలం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లిపోయింది.