NTV Telugu Site icon

CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి.. గాయపడ్డవారికి రూ.50 లక్షలు..

Babu

Babu

CM Chandrababu: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్‌ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు.. అయితే, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి.. విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. ఇక, ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున.. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు..

మరోవైపు.. విశాఖ కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించారు సీఎం చంద్రబాబు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ సభ్యులు చాలా భాదలో ఉన్నారు. కానీ, చనిపోయిన వారిని తీసుకురాలేం. అయితే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తాం అన్నారు.. తీవ్రంగా గాయపడిన వారికి యాబై లక్షల రూపాయలు అందిస్తాం అన్నారు.. ఆ కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలో.. ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆధుకుంటాం అన్నారు.. జరిగిన సంఘటన చాలా భాదాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

కాగా, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది మృతచెందగా.. 36 మందికి గాయాలయ్యాయి.. అందులో 10 మందికి తీవ్రగాయాలు కాగా.. 26 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. అయితే, వారికి ఎంత ఖర్చు అయినా ఉత్తమ వైద్య సేవలందిస్తాం. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తాం అని ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున.. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 లక్షల చొప్పున.. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..