NTV Telugu Site icon

Chittoor: పంట పొలంలో ఏనుగు మృతి.. కారణం ఇదేనా..?

Untitled 2

Untitled 2

Chittoor: అడవుల్లో ఉండాల్సిన వన్య ప్రాణులు అడవిని వదిలి జనారణ్యం లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరకక పంట పొలాల ల్లోకి వస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వన్య ప్రాణులు నాశనం చేస్తున్నాయి. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వన్య ప్రాణుల ప్రాణాలకు హాని తలెపెట్ట లేరు.. ఈ క్రమంలో ఏం చెయ్యాలో తెలియక రైతులు తల పట్టుకుంటున్నారు. ఇక అడవి ధాటి బయటకు వచ్చిన వన్య ప్రాణులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా వన్య ప్రాణులు పంట పొల్లాల్లో ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా చింతూరు జిల్లాలో వెలుగు చూసింది.

Read also:Sara Ali Khan: గులాబీ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తున్న సారా అలీ ఖాన్..

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. వివరాల లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని సదుం మండలం లోని బూరగమంద పంచాయతీ లోని గంటావారిపల్లి లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఈ ఏనుగుల గుంపు గ్రామం లోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వ్యవసాయ పొలాలలో ఏనుగులు భీభత్సము సృష్టిస్తున్నాయి. కాగా వ్యవసాయ పొలంలో సంచరిస్తున్న ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పంట పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని తాకింది. దీనితో ఏనుగుకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన గ్రామస్థులు ఏనుగు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.