AP Crime: వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ… ప్రియురాలి పనే..!
- కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన యువకుడి హత్య..
- హత్య కేసును ఛేదించిన రాజోలు పోలీసులు..
- ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఈ నెల 10వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. ప్రియుడి హత్య వెనుక ప్రియురాలు ఉన్నట్టుగా గుర్తించారు.. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.. మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోయల్ జార్జ్.. గుడిమెల్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి (భర్తను వదిలేసిన వివాహిత) ప్రేమలో పడ్డాడని.. దీంతో.. గత కొంతకాలంగా పెళ్లి కాకుండానే ఇద్దరూ సహజీవనం చేశారని తెలిపారు.. అయితే, గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన నోయల్ జార్జ్.. తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు ప్రశాంతి చెప్పిందని వెల్లడించారు.
Read Also: Nani: NTVతో కలిసి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించిన నేచురల్‌స్టార్..
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
అయితే, కాకినాడలో ఉంటున్న నోయల్ జార్జిని పథకం ప్రకారం ప్రశాంతి తో ఫోన్ చేయించి ప్రకాష్ దిండికి రప్పించాడు..రాపాక ప్రశాంతి, తన అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ ముగ్గురు కలిసి నోయల్ జార్జ్ పై ఇనుప రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు.. వీరి నుండి తప్పించుకుని పారిపోయే సమయంలో తన తండ్రికి ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మృతుడు జార్జ్.. కానీ, పారిపోతున్న నోయల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం ఉండగానే దిండి బ్రిడ్జిపై నుండి గోదావరిలో విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేలా చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి.. అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు అని తెలిపారు. ఈ నెల 10వ తేదీన నోయల్ జార్జి తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా మొదట నమోదు చేశాం.. ఈ నెల 13 న అంతర్వేది పల్లిపాలెం వద్ద సముద్రం తీరాన లభ్యమైన నోయల్ జార్జ్ మృతదేహహంపై ఉన్న గాయాలతో సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు శాం.. హత్యకు కారణమైన నిందితులను రిమాండ్ కి తరలింవామని సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!