Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, కాకినాడకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందని వారు తెలిపారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వని వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామనే ధోరణి నేతల్లో కనిపిస్తున్నదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం విదితమే.. ఇప్పటికే ఏర్పడిన జిల్లాల్లో కొన్ని మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది.. ఇప్పటికే పలు మార్లు దీనిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది.. ఈ తరుణంలో రామచంద్రాపురం నియోజకవర్గ ప్రాంత డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేదా? అనేది చూడాలి..
Read Also: Namo Jersey: టీమిండియా మహిళల జట్టుతో ప్రధాని మోదీ భేటీ.. పీఎంకు సర్ప్రైజ్ గిఫ్ట్..!
