NTV Telugu Site icon

Minister Vasamsetti Subhash: ఒక్క ఫ్యాక్టరీ రాలేదు.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడాయి..!

Vasamsetti Subhash

Vasamsetti Subhash

Minister Vasamsetti Subhash: గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్‌ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ కి అసెంబ్లీలో మొఖం చూపించడం లేదని.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తారని ఆయనకు భయంతో అసెంబ్లీకే రావటం లేదని విమర్శించారు.. కనీసం డిబేట్‌లో కూర్చోబెడితే ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలేని.. ఏ డిపార్ట్మెంట్ మీద జగన్ కి పట్టులేదని ఆరోపించారు.

Read Also: Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం

ఇక, కార్మిక శాఖలో థర్డ్ పార్టీ ఏజెన్సీలను పెట్టి అధికారులతో కుమ్మక్కై వ్యవస్థని కొల్లగొట్టారని విమర్శించారు మంత్రి సుభాష్‌.. థర్డ్ పార్టీ ఏజెన్సీ అక్రమాల కారణంగాఒక్క ఫ్యాక్టరీ రాకపోగా.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడి హైదరాబాద్ కు తరలి వెళ్లాయిన్నారు.. ప్రజా సంక్షేమం మీద వైఎస్‌ జగన్ కి చిత్తశుద్ధి లేదు.. నవరత్నాల పేరుతో వ్యవస్థలను దోచేశారు.. కార్మిక శాఖలో మూడు వేల కోట్లు నిధులు దారి మళ్ళించారు.. అలాగే బీసీ సంక్షేమ శాఖలో నిధులు సైతం దారి మళ్లించారు.. సేవ్ డెమోక్రసీ పేరుతో 34 మంది వైసీపీ వారిని చంపారని డివైడ్ టాక్ తో ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై చంద్రబాబు కానీ.. తెలుగుదేశం నేతలు గానీ.. 34 మంది పేర్లు ఇమ్మంటే ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడం వల్ల రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేదు అని వ్యాఖ్యానించారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌.

Show comments