Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Floods: గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభావం చూపుతోంది. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక కాజ్‌వేపైకి వరద నీరు చేరడంతో కాజ్వే పూర్తిగా జలమయమైంది. దీంతో కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలోకి చేరడంతో కోనసీమలోని గోదావరి, వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి పాయలన్నింటిలోనూ నీటి ప్రవాహం పెరిగింది. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వరద ఉద్ధృతి మరింత పెరిగితే అయినవిల్లి ఎదురుబిడియం కాజ్‌వేపైకి కూడా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా వరద నీటిలోకి వెళ్లవద్దని, కాజ్‌వేలపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల ప్రభావంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11 పాయింట్ 6,0 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 11 పాయింట్ 7,5 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే గత కొద్ది గంటలుగా గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజ్‌కు సంబంధించిన 175 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 9 లక్షల 62 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
తాజావార్తలు
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!