Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ambati Rayudu Reveals Secret Behind Meeting With Cm Jagan

Ambati Rayudu: అందుకే సీఎం జగన్‌ని కలిశాను.. సీక్రెట్ రివీల్ చేసిన అంబటి రాయుడు

Published Date :June 30, 2023 , 11:29 pm
By NTV WebDesk
Ambati Rayudu: అందుకే సీఎం జగన్‌ని కలిశాను.. సీక్రెట్ రివీల్ చేసిన అంబటి రాయుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ambati Rayudu Reveals Secret Behind Meeting With CM Jagan: ఇటీవల తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో అంబటి రాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని.. వైసీపీ పార్టీలో చేరడం ఖాయమని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్‌తో భేటీ వెనుక గల అసలు సీక్రెట్ ఏంటో రివీల్ చేశాడు. తాను కేవలం స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు సీఎంని కలిశానని స్పష్టం చేశాడు. రాష్ట్రంలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని.. తాను కూడా క్రీడారంగంలో తనవంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు.

CM YS Jagan: జులై 4న సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించాడు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాటలు వేస్తోందని.. విద్యారంగంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని కొనియాడాడు. పాఠశాలల విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నాడు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని, అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నానని తెలిపాడు. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని, రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని అన్నాడు. ప్రజలకు సేవ చేయాలని తన తాత దగ్గర నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.

Gudivada Amarnath: సాహితీ ఫార్మా అగ్నిప్రమాదంపై ప్రాథమిక నివేదిక.. యంత్రాంగం పకడ్బందీగా ఉందన్న మంత్రి

కాగా.. అంతకుముందు సీఎం జగన్‌తో భేటీ అయినప్పుడు, ట్విటర్ మాధ్యమంగా అంబటి రాయుడు సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించాడు. రాష్ట్ర యువత కోసం పటిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తోందని తెలిపాడు. ‘‘గౌరవనీయులైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు రూపా మేడమ్‌, సీఎస్కే మేనేజ్‌మెంట్‌తో కలవడం జరిగింది. ఈ భేటీలో వారితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వెనుకబడిన వారికి విద్యపై చర్చించాం. మన రాష్ట్ర యువత కోసం ప్రభుత్వం పటిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తోంది’’ అంటూ ట్వీట్ చేస్తూ.. సీఎం జగన్‌తో కలిసిన ఫోటోనూ షేర్ చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambati Rayudu
  • ap politics
  • ap sports
  • CM YS Jagan
  • rythu bharosa centers

తాజావార్తలు

  • Iran War: “ట్రంప్‌ను వదిలిపెట్టం, మూల్యం చెల్లించుకోవాల్సిందే”.. ఇరాన్ బిగ్ వార్నింగ్..

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • Iran War: “యురేనియం” టార్గెట్‌గా యూఎస్-ఇజ్రాయిల్ ప్లాన్.. ఇరాన్‌లోకి స్పెషల్ ఫోర్సెస్.!

  • Mohammad Amir: “ఆ ఇద్దరు లేకుంటే మీకు దిక్కే లేదు”.. టీమిండియాపై మళ్లీ విషం కక్కిన పాక్ మాజీ పేసర్

  • Samyuktha:ఉమెన్స్ డే స్పెషల్.. ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి సంయుక్త.. పవర్‌ఫుల్ లుక్‌

ట్రెండింగ్‌

  • Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!

  • UK07 Rider: “అమ్మా నీ ప్రేమ కావాలి”.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఫేమస్ యూట్యూబర్ సూసైడ్ అటెంప్ట్.. కట్‌చేస్తే..

  • Bumrah ICC Finals Stats: ఐసీసీ ఫైనల్స్‌లో ‘బౌలింగ్ కింగ్’.. ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన జస్ప్రీత్ బుమ్రా!

  • Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions