NTV Telugu Site icon

Ambati Rambabu: పూటకో మాట మాట్లాడే పవన్, చంద్రబాబు కలిసి.. వైసీపీని ఏం చేయలేరు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Strong Counter To Pawan Kalyan Chandrababu Kanna Lakshmi Narayana: పూటకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి తమ వైసీపీని ఏం చేయలేరని మంత్రి అంబాబు రాంబాబు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య రహస్య బంధాలు ఎప్పటి నుండో కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని.. ఆ కుట్రలో భాగంగానే వాలంటీర్లపై బురద జల్లేందుకు వారిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసుని పదే పదే ప్రస్తావిస్తూ లబ్ధి పొందాలని వాళ్లు చూస్తున్నారన్నారు. పవన్, చంద్రబాబులకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదని.. ఎన్నికల తర్వాత వాళ్లు హైదరాబాద్ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పవన్, బాబు కలిసే జీవిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Venugopala Krishna: పిల్లి సుభాష్‌కు మంత్రి వేణు కౌంటర్.. ఎవరి ట్రాప్‌లోనో పడి..

ఇదే సమయంలో.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ డబ్బులతో మీటింగులు పెట్టి చంద్రబాబు, పవన్‌లపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని కన్నా చెప్పారని.. మరి టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ డబ్బులతో మీటింగ్‌లు పెట్టి మోడీని తిట్టినప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇంకా పోలవరం పూర్తి కాకముందే కోట్లు ఖర్చు పెట్టి, అక్కడికి టీడీపీ కార్యకర్తల్ని తీసుకెళ్లి భజన చంద్రబాబు భజన చేయించుకున్నారని.. దీనిపై మాట్లాడాలని అడిగారు. తండ్రి పేరు చెడగొట్టడానికి జగన్ వచ్చాడని కన్నా హద్దుమీరి మాట్లాడారని.. జగన్ ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి వైఎస్ పేరుని వెయ్యి రెట్లు పెంచారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కేంద్రీయ విద్యాలయానికి 500 మీటర్ల రోడ్లు వేయించలేదని తనపై కన్నా ఆరోపణలు చేశారని.. తనకు ఆ రోడ్డు గురించి అభ్యర్థన వచ్చిన వెంటనే రూ.40 లక్షలు అంచనా వేసి, అప్పటికప్పుడే రోడ్డు వేయడానికి అనుమతి ఇచ్చానని వివరించారు.

Pawan Kalyan: సీఎం జగన్.. ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పండి

సత్తెనపల్లి కేంద్రంగా గంజాయి అమ్ముతున్నారని కన్నా చెప్తున్నారని.. సత్తెనపల్లికి గంజాయిని కన్నానే తీసుకొచ్చాడేమోనని మంత్రి అంబటి కౌంటర్ వేశారు. కన్నా వస్తాడు కాదని.. ఓ బిచ్చగాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వేయలేని కన్నా.. ఇప్పుడేమో జోలి పట్టి రోడ్లు వేస్తానంటూ కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని.. గతంలో చంద్రబాబుని, రాయపాటిని కన్నా బూతులు తిట్టాడని గుర్తు చేశారు. చిరంజీవికి ఓట్లు వేసినందుకు కాపుల్ని సైతం కన్నా తిట్టాడని విరుచుకుపడ్డారు.

Show comments