Ambati Rambabu: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కూటమి ఏడాది పాలన సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని మేం అంటున్నాం.. ఇచ్చిన హామీలు మొత్తం ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తే శబాష్ అని అనే వాళ్ళం.. తల్లికి వందనం ఎప్పుడు ఇచ్చారు.. సంవత్సరం గడిచాక ఇచ్చారని ఆరోపించారు. జగన్ ఒక్కరికే ఇచ్చారని అన్నారు.. మీరు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాం అన్నారు.. మొదటి సంవత్సరం ఇవ్వలేదు.. రెండో సంవత్సరం ఇచ్చారు.. కొంత మంది ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడ్డాయి.. ఒక పిల్లవాడికి రూ. 13 వేలు.. మరో పిల్ల వాడికి రూ. 10 మూడో వాడికి రూ. 5 వేలు మాత్రమే పడ్డాయి.. అలాగే, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు.. ఒక్కటే ఇచ్చారు.. ఇంతటితో సూపర్ సిక్స్ అయిపోయిందన్నారని అంబాటి రాంబాబు తెలిపారు.
Read Also: Youtube: యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో కొత్త గైడ్‌లైన్స్..! ఇలా చేస్తే డబ్బులు గోవిందా..!
అయితే, తల్లికి వందనం ఆలోచన లోకేష్ కి పుట్టిందన్నాడు చంద్రబాబు.. పప్పు లోకేష్ కి ఎలా వచ్చింది ఈ ఆలోచన.. ఇది జగన్ పెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం.. మీరు కాపీ కొట్టారు అని అంబాటి రాంబాబు ఆరోపించారు. ఇంకా నయం ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్య శ్రీ కూడా నేనే పెట్టానని చంద్రబాబు అంటాడేమో.. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన చంద్రబాబు అమ్మ వడి లాంటి పథకాలు ఎందుకు పెట్టలేదు..? అని ప్రశ్నించారు. 2014లో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు మాటలు నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా ఓట్లు వేస్తే.. అందరిని ముంచాడని ఎద్దేవా చేశారు. బ్యాంక్ లో పెట్టిన బంగారం బయటకు రాలేదన్నారు. ఇక, ఇది సుపరిపాలన కాదు మోసపు పరిపాలన అని.. ప్రజలకు మేము చెప్పడమే.. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం అన్నారు. చంద్రబాబు వచ్చాక నాణ్యమైన మందు అన్నారు.. ఎక్కడా కనపడటం లేదు… వైసీపీ ప్రభుత్వంలో ఉన్న డిస్టిలరీలే ఇప్పుడు కూడా మందు సరఫరా చేస్తున్నాయి.. మేము ఊహించని విధంగా ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి.. కానీ ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి అంబాటి విమర్శించారు.
Read Also: Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్
ఇక, జగన్ రాష్ట్రంలో పరామర్శకు ఏ ప్రాంతానికి వెళ్లినా.. అయ్యా చంద్రబాబు మోసపూరిత మాటల వల్ల ఓట్లు వేశాం.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు బంఫర్ మెజారిటీ తో గెలుస్తారని ప్రజలు చెబుతున్నారని అంబాటి రాంబాబు తెలిపారు. దుర్మాగపు పరిపాలన అందిచడంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.. సోషల్ మీడియా కేసులు మీద కూడా.. పోలీసులు విపరీతంగా స్పందిస్తున్నారు.. దొంగల్ని, మోసాలు చేసే వాళ్ళని పట్టుకోవడం మానేశారు పోలీసులు.. వైఎస్ఆర్ చనిపోయాక జగన్ ఓదార్పు యాత్ర చెయ్యలేదా.. ఆ రోజు అడ్డుకోలేదుగా.. రౌడీ షీట్లు పెట్టలేదు.. అరెస్టులు చెయ్యలేదు.. ఇప్పుడెందుకు అరెస్టులు చేస్తున్నారు.. అడ్డుకుంటున్నారు.. కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. జగన్ వెళ్లే ప్రతి చోటా పోలీసులతో అడ్డుకుంటున్నారు.. మామూలుగా అయితే, 15 వేల మంది వచ్చే వారు.. అడ్డుకోవడంతో రెట్టింపు ప్రజలు వస్తున్నారని తెలియజేశారు. రాజధానికి రెండో విడత 45 వేల ఎకరాలు కావాలంట.. అప్పట్లో 55 వేల ఎకరాలు సేకరించారు.. దుబాయ్, మలేషియా, సింగపూర్ అంటూ అన్నారు.. ఐదేళ్లు ఏం చేయ్యలేదు.. ఇప్పుడు ఇక్కడ భూమిని కొనుగోలు చేసేవాడు లేడు అని మాజీ మంత్రి రాంబాబు మండిపడ్డారు.
