NTV Telugu Site icon

Ambati Rambabu: రాబోయే ఎన్నికల్లో 175 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుంది

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Says YCP Will Definitely Win 175 Seats In Next Elections: మునుపటి కంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని.. 175కి 175 సీట్లను వైసీపీ కచ్ఛితంగా కైవసం చేసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో మిర్చి యార్డులో పర్యటించిన అనంతరం మంత్రి అంబటి మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఇప్పుడే రాష్ట్ర ఖజానా మెరుగ్గా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో కలిపి అద్భుతంగా పరిపాలన సాగుతోందని అన్నారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కన్నాకు భద్రత తొలగించిన విషయం తనకు తెలియదని.. గతంలో తనకు చంద్రబాబు ద్వారా ప్రమాదం ఉందని కన్నా తనకు చెప్పాడని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు చంకలో కన్నా కూర్చున్నాడు కాబట్టి, ప్రమాదం ఉండదన్న ఉద్దేశంతో ఆయనకు భద్రత తొలగించి ఉండొచ్చని సెటైర్లు వేశారు. తనకు ప్రత్యర్థి కన్నా కాబట్టి దూకుడు పెంచుతున్నానని, ప్రత్యర్థులను ఢీకొట్టడంలో తానెప్పుడూ దూకుడుగానే ఉంటానని వివరించారు. ఇక పురందేశ్వరి వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని, మనం స్పందించే స్థాయి కూడా రాష్ట్రంలో ఆ పార్టీకి లేదని కౌంటర్ వేశారు.

Salaar: ట్రాన్స్ జెండర్స్ తో ప్రభాస్ ఫైట్.. నీల్ మావా.. ఏం ప్లాన్ చేశావ్ ..?

అంతకుముందు కూడా.. కేంద్రీయ విద్యాలయానికి 500 మీటర్ల రోడ్లు వేయించలేదని కన్నా తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా అంబటి రాంబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన వద్దకు ఆ రోడ్డు సమస్య రాగానే.. అప్పటికప్పుడే తాను రూ.40 లక్షలు మంజూరు చేశానని పేర్కొన్నారు. బూతులు తిట్టడంలో కన్నాకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవ్వాలని దుయ్యబట్టారు. కన్నా వస్తాదు కాదు, ఒక బిచ్చగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో.. పవన్, చంద్రబాబులపై కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్‌లకు స్వరాష్ట్రంలో సొంత ఇల్లు లేదని.. ఎన్నికలయ్యాక వాళ్లు హైదరాబాద్‌కి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరు కలిజే ప్రయాణం చేస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారని.. ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థపై బురద జల్లుతున్నారని ఆరోపించారు.

Minister Roja: పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు