Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించిన వ్యవహారంలో రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఈ సమన్లు పంపారు. గతంలోనే ఈడీ అధికారులు విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటికీ, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు అంబటి రాంబాబు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారు.
ఆ తర్వాత తనకు గుండెకు స్టెంట్లు వేసినట్లు ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన వైద్య నివేదికలను కూడా ఈడీ కార్యాలయానికి పంపించారు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఈడీ అధికారులు ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొంటూ ఆయనకు అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా సమన్లు పంపారు. అయితే.. ఆ మెయిల్‌ను తాను సమయానికి చూసుకోలేదని అంబటి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో నిన్న మరోసారి కొత్తగా నోటీసులు జారీ చేసిన ఈడీ బృందం, రేపు కచ్చితంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అధికారుల ఆదేశాల మేరకు రేపు ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
- AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
- YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
- Fire Accident: విశాఖ HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణకు హాజరు!
-
Delhi: లాయర్స్ vs కాప్స్.. రోడ్డెక్కిన 150 మంది పోలీసులు.. ఏసీపీ మనస్వి వశిష్ఠపై సస్పెన్షన్ వేటు
-
Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
-
AP Muncipal Counting: మున్సిపల్ కౌంటింగ్‌లో సత్తా చాటుతున్న కూటమి.. వైసీపీకి షాకిస్తున్న ట్రెండ్స్..
ట్రెండింగ్
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!