Site icon NTV Telugu

Jagan Convoy Accident: జగన్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై టీడీపీ తప్పుడు ప్రచారం.. వైసీపీ ఫైర్!

Ycp

Ycp

Jagan Convoy Accident: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాద వీడియోపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చి రాజకీయ కుట్ర కోసం ఉపయోగిస్తున్నట్లు ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది ఎక్స్ వేదికగా. రాష్ట్రంలో పాలన, ప్రజా సంక్షేమం పట్ల కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది.. అందుకే, ఈ వీడియోను వైరల్ చేస్తూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్స్ పొలిటిక్స్ కు పాల్పడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా పేర్కొనింది.

Read Also: Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!

అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వచ్చిన భారీ ప్రజా స్పందనను రావటాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది. వైసీపీ నాయకులను వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది. జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సమయంలో సింగయ్య అనే వ్యక్తి మరణం దురదృష్టకరం.. ఈ ఘటనపై మానవత్వంతో వ్యవహరించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారు.. అత్యంత బాధాకర రీతిలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని పేర్కొనింది. ఈ విషయం తెలిసిన తర్వాత రోజు మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. వారి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయ చెక్కును కూడా అందజేశారని వెల్లడించింది.

Read Also: US Iran Conflict: ఇరాన్ ప్రతిదాడులకు దిగితే, మేం గట్టిగా జవాబిస్తాం..

కానీ, ప్రమాదానికి కారణమైన వాహనం జగన్ కాన్వాయ్‌లో వాహనం కాదని, ఓ ప్రైవేట్ వాహనం అని పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టంగా తెలిపారు. సంబంధిత వాహన డ్రైవర్, యజమానిని గుర్తించి విచారించారు.. ఈ ప్రమాదానికి కాన్వాయ్‌తో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించారు.. ఇన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కూటమి సర్కార్ జగన్ తప్పు అన్నట్లుగా ఒక వీడియోను విడుదల చేసిందని వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ మండిపడ్డారు. ఈరోజు వైరల్ అయిన వీడియోలో కాన్వాయ్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.. ఆ ప్రమాదం జరిగిందని జగన్ కు తెలియదు.. జెడ్ ప్లస్ లో ఉన్న జగన్ కు కనీసం రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ బృందం కాన్వాయ్‌కు కేటాయించాలి.. ప్రస్తుత ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైంది.. ఫలితంగా పదేపదే లోపాలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నీతి, నిజాయితీ, బాధ్యతాయుతమైన రాజకీయాలకు వైసీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Exit mobile version