Site icon NTV Telugu

MP Pilli Subhash Chandra Bose: పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత.. పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ..

Mp Pilli Subhash Chandra Bo

Mp Pilli Subhash Chandra Bo

MP Pilli Subhash Chandra Bose: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.. వైద్యుల సహకారంతో వెనువెంటనే తేరుకున్నారట వైసీపీ రాజ్యస సభ్యులు సుభాష్ చంద్రబోస్.. ఈ విషయాన్ని మీడియాకు వివరించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి..

Read Also: Sri Lakshmi Constructions Fraud: శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్ ఎండి గుర్రం విజయలక్ష్మీ అరెస్టు.. రిమాండ్కు తరలింపు!

ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థతపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ఈరోజు పార్లమెంట్‌లోకి వస్తూ.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కళ్లు తిరిగి పడిపోయారు.. ఇది గమనించిన సిబ్బంది.. మాకు, వైద్యులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. షుగర్‌ బాగా డౌన్ అయ్యింది.. మార్నింగ్‌ నుంచి ఏమీ తినకపోవడం వల్లే షుగర్‌ డౌన్‌ అయినట్టు డాక్టర్లు చెప్పారని తెలిపారు.. పార్లమెంట్‌ లోనే ప్రాథమిక చికిత్స అందించి.. తర్వాత ఎలాంటి సమస్య లేకుండా ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించాం. వైద్యులు ఎలాంటి ఇష్యూ లేదని.. ప్రస్తుతం ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..

Exit mobile version