Site icon NTV Telugu

YS Jagan: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నేడు జగన్‌ భేటీ.. తర్వాత బెంగళూరుకు..!

Ysjagan

Ysjagan

YS Jagan: పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఇవాళ తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో భేటీకాబోతున్నారు.. వైసీపీ నేతలతో వరుస సమావేశాలలో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంకానున్నారు జగన్‌.. ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నారు.. ఇటీవల అవిశ్వాస తీర్మానాలు.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్..

Read Also: Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్‌

మరోవైపు.. మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బుధవారం రోజు వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. నిన్న పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీల­కులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించిన జగన్‌.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేసిన విషయం విదితమే..

Read Also: Jammu Kashmir: ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు.. కీలక వస్తువులు స్వాధీనం!

మరోవైపు.. ఇవాళే బెంగుళూరు వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. సాయంత్రం 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.. ఇక, రాత్రి 8.00 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు వైఎస్‌ జగన్..

Exit mobile version