YS Jagan: బాలినేని ఎఫెక్ట్..! ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ..
- జనసేనలో చేరేందుకు రెడీ అయిన బాలినేని..
- అలర్ట్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్..
- ఇవాళ ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. ముఖ్య నేతలతో భేటీ..
- పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం..
YS Jagan: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం చర్చగా మారింది.. ఇదే సమయంలో.. ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడం.. త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..
Read Also: CM Chandrababu: శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్‌లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్‌లు..
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. బాలినేని వెంట ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.. కాగా, బుధవారం రోజు వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. శుక్రవారం రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు.. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్ మీద ప్రేమతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైసీపీలోనే ఉన్నానని.. గతంలోనే పవన్.. వైసీపీలో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలో చేరలేకపోయానని బాలినేని అన్నారు. ఏ డిమాండ్స్ లేకుండానే జనసేన పార్టీలో చేరుతున్నా.. కూటమి నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై బాలినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్‌లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో