NTV Telugu Site icon

Tirumala Laddu Controversy: సుప్రీంకోర్టు తీర్పుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

Ys Jagan

Ys Jagan

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్టు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.. తిరుమల ప్రతిష్టను ఎలా అపవిత్రం చేశారో గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబును మొట్టి కాయలు వేశాయన్నారు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బతీసే విధంగా వరుస అబద్ధాలు ఆడారు.. చంద్రబాబు నియమించిన టీటీడీ ఈవో కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటన చేశారని పేర్కొన్నారు.

Read Also: Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!

చంద్రబాబు మంచి వాడు అయితే ఈ ఆధారాలు చూసి సిగ్గుపడతాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్‌.. దేవుడంటే భయం భక్తి ఉన్న వారు ఎవరైనా ఇవన్నీ చూసి పశ్చాత్తాపం వ్యక్తం చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. కానీ, చంద్రబాబు అలాంటివి ఏమీ చేయరు.. భయం, భక్తి లేకుండా చంద్రబాబు ప్రవర్తన ఉంది.. టీటీడీ అధికారులు ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంకా అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారు.. చంద్రబాబుకి సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తున్నట్టు నేషనల్ మీడియా క్లారిటీగా చెబుతుంటే నాపై ట్విట్టర్ లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు.. చంద్రబాబును సుప్రీంకోర్టు తిడుతుంటే నాపై సీరియస్ అంటూ వక్రీకరించి ట్విట్టర్ లో టీడీపీ అధికారిక ఖాతా నుంచి పోస్టులు పెడుతున్నారు.. చంద్రబాబు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడు.. క్వాలిటీ లేకుండా వచ్చిన నెయ్యి ట్యాంకర్లకు లోపలకు అనుమతి ఉండదు అనేది మళ్లీ చెబుతున్నాను అని స్పష్టం చేశారు జగన్‌.

Read Also: Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి

తిరుపతిలో గొప్ప వ్యవస్థ ఉంది.. నెయ్యి ట్యాంకర్లకు ప్రొసీజర్ ప్రకారం క్వాలిటీ ఉంటేనే అనుమతి ఇస్తారు.. క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు అని గుర్తుచేశారు వైఎస్‌ జగన్.. జులై 6, జులై 12న వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇవ్వటం జరిగింది.. NDDB రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్యాంకర్లు వెనక్కి పంపినట్టు ఈవో స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారం చేశారు.. 100 రోజుల పాలనలో వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించకుండా చంద్ర బాబు డైవర్షన్ కోసం ఈ ఆరోపణలు చేశారు.. ఈవో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని ట్యాంకర్లు వెనక్కి పంపినట్టు స్పష్టంగా చెబితే.. చంద్రబాబు మాత్రం జంతువుల ఫ్యాట్ కలిసినట్టు అసత్య ప్రచారం చేశాడు.. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేశారు అని మండిపడ్డారు..

Read Also: KTR: రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం..

టీటీడీ ఈవో చెప్పినా కూడా చంద్రబాబు మాత్రం అబద్ధాలు చెబుతాను, రాజకీయ ఉద్దేశాలు మాత్రమే ముఖ్యమని చెప్పిన అబద్దమే మళ్ళీ మళ్ళీ చెప్పారని దుయ్యబట్టారు వైఎస్‌ జగన్.. ట్యాంకర్లు వెనక్కి పంపాలని ఈవో చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ట్యాంకర్ల నెయ్యిని వాడామని చెప్పారు.. భయం లేకుండా చంద్రబాబు కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు.. అబద్దాలతో అపవిత్రం చేస్తూ చేసిన ఆరోపణలపై చంద్రబాబుకు మొట్టి కాయలు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాం.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Show comments