Tirumala Laddu Controversy: సుప్రీంకోర్టు తీర్పుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
- తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..
- చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది..
- సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను ఎలా రెచ్చ గొడుతున్నాడు..
- దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్న జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్టు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.. తిరుమల ప్రతిష్టను ఎలా అపవిత్రం చేశారో గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబును మొట్టి కాయలు వేశాయన్నారు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బతీసే విధంగా వరుస అబద్ధాలు ఆడారు.. చంద్రబాబు నియమించిన టీటీడీ ఈవో కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటన చేశారని పేర్కొన్నారు.
Read Also: Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
చంద్రబాబు మంచి వాడు అయితే ఈ ఆధారాలు చూసి సిగ్గుపడతాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. దేవుడంటే భయం భక్తి ఉన్న వారు ఎవరైనా ఇవన్నీ చూసి పశ్చాత్తాపం వ్యక్తం చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. కానీ, చంద్రబాబు అలాంటివి ఏమీ చేయరు.. భయం, భక్తి లేకుండా చంద్రబాబు ప్రవర్తన ఉంది.. టీటీడీ అధికారులు ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంకా అసత్య ప్రచారం చేస్తూనే ఉన్నారు.. చంద్రబాబుకి సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తున్నట్టు నేషనల్ మీడియా క్లారిటీగా చెబుతుంటే నాపై ట్విట్టర్ లో తప్పుడు పోస్టులు పెడుతున్నారు.. చంద్రబాబును సుప్రీంకోర్టు తిడుతుంటే నాపై సీరియస్ అంటూ వక్రీకరించి ట్విట్టర్ లో టీడీపీ అధికారిక ఖాతా నుంచి పోస్టులు పెడుతున్నారు.. చంద్రబాబు నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడు.. క్వాలిటీ లేకుండా వచ్చిన నెయ్యి ట్యాంకర్లకు లోపలకు అనుమతి ఉండదు అనేది మళ్లీ చెబుతున్నాను అని స్పష్టం చేశారు జగన్.
Read Also: Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? వంటింట్లో దొరికే ఇది వాడండి
తిరుపతిలో గొప్ప వ్యవస్థ ఉంది.. నెయ్యి ట్యాంకర్లకు ప్రొసీజర్ ప్రకారం క్వాలిటీ ఉంటేనే అనుమతి ఇస్తారు.. క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు అని గుర్తుచేశారు వైఎస్ జగన్.. జులై 6, జులై 12న వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపిన తర్వాత షోకాజ్ నోటీసులు ఇవ్వటం జరిగింది.. NDDB రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్యాంకర్లు వెనక్కి పంపినట్టు ఈవో స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారం చేశారు.. 100 రోజుల పాలనలో వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించకుండా చంద్ర బాబు డైవర్షన్ కోసం ఈ ఆరోపణలు చేశారు.. ఈవో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని ట్యాంకర్లు వెనక్కి పంపినట్టు స్పష్టంగా చెబితే.. చంద్రబాబు మాత్రం జంతువుల ఫ్యాట్ కలిసినట్టు అసత్య ప్రచారం చేశాడు.. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేశారు అని మండిపడ్డారు..
Read Also: KTR: రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం..
టీటీడీ ఈవో చెప్పినా కూడా చంద్రబాబు మాత్రం అబద్ధాలు చెబుతాను, రాజకీయ ఉద్దేశాలు మాత్రమే ముఖ్యమని చెప్పిన అబద్దమే మళ్ళీ మళ్ళీ చెప్పారని దుయ్యబట్టారు వైఎస్ జగన్.. ట్యాంకర్లు వెనక్కి పంపాలని ఈవో చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ట్యాంకర్ల నెయ్యిని వాడామని చెప్పారు.. భయం లేకుండా చంద్రబాబు కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు.. అబద్దాలతో అపవిత్రం చేస్తూ చేసిన ఆరోపణలపై చంద్రబాబుకు మొట్టి కాయలు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాం.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!