YS Jagan: ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ ధర్నాకు జాతీయ నేతలు హాజరయ్యారు.. దీంతో, జగన్‌కు ఇంత మంది నేతల మద్దతు ఎలా వచ్చిందన్న చర్చ మొదలైంది. వైసీపీ కూడా వీళ్లంతా వస్తారని ఎక్కడా చెప్పలేదు. ప్రచారం చేసుకోలేదు. హఠాత్తుగా ఒక్కొక్కరుగా జాతీయ, ఇతర రాష్ట్రాల నాయకులు జగన్ ధర్నా శిబిరానికి క్యూ కట్టడం చూస్తే… ఆయన రూట్ మారుస్తున్నారా? అనే సందేహం వచ్చింది పరిశీలకులకు. ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ మినహా… మిగతా పెద్ద పార్టీలు జగన్ కు మద్దతు పలకడంతో.. జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయా? అనే కొత్త చర్చ మొదలైంది.. అయితే, ఈ రోజు మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..
Read Also: BJP New President: బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఇప్పట్లో లేనటే..?
ఇండియా కూటమిలో చేరతారా? అనే అంశంపై స్పందించిన వైఎస్ జగన్.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫొటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశాం.. అవి చూసిన తర్వాత గళం విప్పాలని కోరాం.. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు వచ్చాయి.. కానీ, కాంగ్రెస్ పార్టీ రాలేదు అనే విషయాన్ని గుర్తుచేశారు.. అసలు కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదు? అనేది ఆ పార్టీనే అడగాలన్నారు.. చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధాలు ఏంటో వాళ్లే చెప్పాలన్న ఆయన.. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు.. కాంగ్రెస్ పెద్దలతో ఎలా టచ్ లో ఉన్నాడో..? కూడా అనేది కాంగ్రెస్ పార్టీనే అడగాలన్నారు.. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ ఇలా అన్ని పార్టీలను పిలిచాం.. కానీ, కాంగ్రెస్ నేతలు ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్లపై స్పందించే కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై ఎందుకు స్పందించదు? అని నిలదీశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.