YS Jagan: ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని కొందరు శ్రేయోభిలాషులు తనకు చెప్పారని.. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలన్నారు.. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమేనని.. పులినోట్లో తలకాయపెట్టడమేనన్నారు.. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారన్నారు.. కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరని, వారికీ ఆ ధైర్యంకూడా లేదన్నారు.. మరోవైపు బాదుడే బాదుడు కనిపిస్తోందన్నారు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు.. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసిందన్నారు.. తాను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తానని.. ప్రతి వారం మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిచేస్తానన్నారు..
Read Also: CM Chandrababu: కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన.. బెంగళూరుకు పయనం
ఇక, కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు.. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్.. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం.. కానీ, ఇప్పుడు విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.. ఆరోగ్యశ్రీకింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం.. 8 నెలల కాలంలోనే 3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారని మండిపడ్డారు.. ఇంటివద్దకే డోర్‌డెలివరీ పరిపాలన నుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.. మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసిందని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..