YS Jagan Foreign Tour: వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Foreign Tour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్ (UK)తో పాటు యూరప్ దేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల (మే) 15వ తేదీ వరకు మొత్తం 25 రోజుల పాటు విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్, యూకే ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్ జగన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Also: MLA Pulivarthi Nani: చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్.. “సినిమా చూపిస్తా”..!
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
అయితే పర్యటనకు ముందు కొన్ని షరతులు కూడా విధించింది సీబీఐ కోర్టు… దేశం విడిచి వెళ్లే ముందు తన కాంటాక్ట్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి ప్రయాణ వివరాలు, అలాగే ష్యూరిటీ వివరాలను సీబీఐ అధికారులకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. దీంతో సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు వైఎస్ జగన్ త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!