YS Jagan: మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా..? నిలదీసిన జగన్..
- ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ లో జగన్ ఫైర్..
- రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?..
- మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?..
- చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే అంటూ దుయ్యబట్టారు జగన్..
Read Also: Phone Tapping Case: రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు.. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు.. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి అని ట్వీట్‌చేశారు జగన్.. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయం.. మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు, ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలి.. చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్..
.@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?