Site icon NTV Telugu

YS Jagan: మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా..? నిలదీసిన జగన్..

Ysjagan

Ysjagan

YS Jagan: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఏపీలో మహిళల భద్రతపై ఎక్స్ (ట్విట్టర్‌)లో మాజీ సీఎం జగన్ ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా?మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే అంటూ దుయ్యబట్టారు జగన్..

Read Also: Phone Tapping Case: రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు.. ఫోన్ ట్యాపింగ్పై విచారణ

తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు.. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు.. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి అని ట్వీట్‌చేశారు జగన్.. పొలిటికల్‌ గవర్నెన్స్‌, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయం.. మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు, ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలి.. చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్..

Exit mobile version