YS Jagan: కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దాడికి గురైన వైసీపీ కార్యకర్తలు గిరిధర్ (ఆర్‌ఎంపీ డాక్టర్), సతీష్‌ను ఫోన్‌లో పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఘటన వివరాలు ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలపై పాశవికంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.. ధైర్యం కోల్పోవద్దని వారికి సూచించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్న ఆయన, అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నాయకులకు నిర్దేశించారు.
Read Also: Check Wine Quality: అలర్ట్.. వైన్ నాణ్యత చెక్ చేయడానికి 3 సింపుల్ టెస్ట్‌లు
తమపై ఎలా దాడి చేశారనే విషయాలను జగన్ కు వివరించారు గిరిధర్, సతీష్.. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదాం.. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం అన్నారు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్.. ఈ అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు.. భవిష్యత్తులో కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.. ఇక, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి.. పార్టీ అందరికీ అండగా ఉంటుంది.. చేయకూడని తప్పులు చేస్తున్న వారికి వైసీపీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెపుతాం అంటూ హెచ్చరించారు వైఎస్ జగన్..
