Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది..

Ycp

Ycp

వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో ఎవరు ఉన్నారో విచారణ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరుతామని తెలిపారు. SCB పెట్టిన తర్వాత 11 వేల ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. వైజాగ్ డ్రగ్ కేసులో తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Suresh Raina: ఎంఎస్ ధోని బ్యాటింగ్ పొజిషన్‌పై సురేష్ రైనా కీలక ప్రకటన!

25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టం అని పేర్కొన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు. సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు, టీడీపీ వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న వాళ్లంతా.. టీడీపీ బంధువులేనని పేర్ని నాని ఆరోపించారు. ఈ డ్రగ్స్ రవాణా వెనుక చంద్రబాబు చుట్టాలు ఉంటూనే జగన్ మీద విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Bharat: వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుంది..

బ్రాందీ పంచే స్థాయిని దాటి డ్రగ్స్ పంచే స్థాయికి చంద్రబాబు, లోకేష్ దిగజారారా అనే అనుమానం కలుగుతోందని పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనేనని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిన వాడు కాబట్టి.. డ్రగ్స్ రవాణాపై లోతైన విచారణ చేపట్టాలని కోరారు. ఓటు కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు కాబట్టి.. విచారణ జరిపించాలని కోరామన్నారు. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు ట్వీట్ చేశారు.. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టేనని తెలిపారు.

Exit mobile version