CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు.. సీఎం అసంతృప్తిని మంత్రి లోకేష్ ధ్రువీకరించారు కూడా, ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించి యాక్షన్ మొదలయింది… ఈ నియోజకవర్గాల్లో పవర్స్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారు.. అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
Read Also:Jammu: జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు
మొన్న జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ఒకసారి చెప్తాను.. రెండుసార్లు చెప్తాను.. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్ప చెప్పే పరిస్థితి ఉండదని.. ఇక కఠిన చర్యలు మాత్రమే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పారు.. మరి ఆయన చెప్పినట్లు ఆచరణలో ఈ రకమైన వాతావరణం ఉంటుందా..? అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది.. ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవటం అంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పవర్ కట్ చేయాలి.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ వచ్చేలా చేయాలి… దీంతోపాటు కొత్త ఇంఛార్జ్‌ని పెట్టాలి. ఎమ్మెల్యే పాత్ర నామమాత్రం చేయాలి.. ఇవన్నీ చేస్తేనే ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్టు.. ఇవేమీ చేయకుండా కేవలం ప్రస్తుతం సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు.. అయితే, వార్నింగ్ ల వల్ల ఒకటి రెండు సందర్భాల్లో ఎమ్మెల్యేలు దారికి వస్తే పర్వాలేదు.. లేకపోతే కనుక మళ్లీ తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.. సీఎం చంద్రబాబు కూడా రెండుసార్లు మించి ఎక్కువ చెప్పను అనే అన్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు రిపీటెడ్ గా తప్పులు చేస్తే సీఎం చంద్రబాబు నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటారు అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతూనే ఉంది.
Read Also: Jeevitha-Rajashekar : కావాలనే జీవిత, రాజశేఖర్ గొడవపడ్డారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
అయితే, ఎమ్మెల్యేల మీద నిజంగానే చర్యలు తీసుకుంటే.. తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం కూడా ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.. ఇదే చర్చ పార్టీ .. ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేల మీద ప్రధానంగా.. సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి .. అయితే కూటమిలో ఉన్న మూడు పార్టీల ఎమ్మెల్యేల వైఖరి వలన కూడా… ఎవరు తప్పు చేసినా కూటమి మీద ప్రభావం పడే అవకాశం ఉంది… కాబట్టి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.. ఒకటి రెండుసార్లు ఎమ్మెల్యేలను వరుసగా పిలిచి మాట్లాడుతున్నారు.. వారానికి నాలుగు రోజుల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు.. ఇంకా శృతి మించితే కనుక చంద్రబాబు యాక్షన్…. తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది.. ఏ డోస్ లో ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు యాక్షన్ తీసుకోనున్నారు.. ఇదంతా కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి యాక్షన్ తీసుకుంటే కనుక ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పవర్స్ మాత్రం కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ..మరి ప్రస్తుతం వివాదాల్లోని ఎమ్మెల్యేలు పీకల మీదకు తెచ్చుకుంటారా? లేకపోతే వారి వైఖరి మార్చుకుంటారా? లేకపోతే దారిలోకి వస్తారా..? అనేది. చూడాలి …ప్రధానంగా సీనియర్లు బానే ఉన్నారు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వల్లే ఇబ్బంది అని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఎక్కువగా వివాదాల్లో కొత్త ఎమ్మెల్యేలు కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కొత్త ఎమ్మెల్యేలు కనుక రిపీట్ గా తప్పులు చేస్తే సీఎం చంద్రబాబు తప్పని సరిగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండనడం లో ఎలాంటి సందేహం లేదు..
