AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ అక్రమ రవాణా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సత్యప్రసాద్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సీఐడీ కోర్టు అనుమతించింది. ఈ నెల 18న సత్యప్రసాద్ స్టేట్మెంట్ను రికార్డు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎక్సైజ్ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. మరోవైపు.. ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చూపించేందుకు సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 18న కారుమూరి నాగేశ్వరరావును సీఐడీ కోర్టులో హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
మరోవైపు లిక్కర్ కేసులో నిందితుడైన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు సిట్ అధికారులు ఆయనను విచారించారు. ఈ విచారణలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సహకరించలేదని అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో ఆయనను 200కుపైగా ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. కేసులోని అన్ని వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను రాజ్ కేసిరెడ్డి, చాణక్య మాత్రమే నిర్వహించారని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా జరిగిన నగదు లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిపారు. కస్టడీ పూర్తవడంతో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించారు.
Also Read
- AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
తాజావార్తలు
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
-
Explainer: హైదరాబాద్‌లో బతకలేమా? ప్రపంచంలోనే చివరి నుంచి రెండో స్థానం..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!