Vangalapudi Anitha: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది.. అలాగే రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉండాలి.. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే 175 మందికే అధ్యక్షా అనే అవకాశం వచ్చిందన్నారు.. అయితే, జగన్ వారి పార్టీ వ్యవహారాలు చూస్తుంటే రాజకీయాలు దిగజారాయా అనిపిస్తుంది.. కనీసం, మానవత్వం లేకుండా హింసకు ప్రేరేపించి అరాచకం సృష్టించారని ఫైర్ అయ్యారు.. జగన్ తన పల్నాడు పర్యటనలో ఎంతమంది వస్తారు అని పోలీసులు అడిగారు.. అయినా సరైన సమాధానం లేదన్న ఆమె.. పరామర్శ కు వెళ్లే వ్యక్తి రోడ్ షో చేశారు.. అందరికి అభివాదాలు.. షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లారని విమర్శించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
బండి (కారు) కింద పడిపోతే కనీసం అంబులెన్స్ లో తరలించాలి కదా ? యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ముళ్ల పొదల్లో వదిలేశారు. జగన్ కు రాజకీయ లబ్ది తప్ప మనుషుల ప్రాణాలు లెక్కలేదా..? ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత.. ఏడాది క్రితం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దగ్గరకు జగన్ వెళ్లారు అని విమర్శించారు.. బాబాయ్ హత్య.. కోడి కత్తి డ్రామా… ఇవన్నీ చూసాం.. ఇంకా సమర్ధించుకుని మాట్లాడుతున్నారు. జాలి దయ.. లాంటి పదాలు మాట్లాడడానికి అసలు అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్.. ఇప్పుడు జగన్ పర్యటనలు అలాగే ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. రెంటపాళ్ల పర్యటనలో ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు.. చాలా తక్కువ మంది వెళ్లాలని చెప్పారు.. పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేశారని దుయ్యబట్టారు అనిత..
Read Also: Trisha: మరోసారి రచ్చ రేపిన త్రిష?
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు.. చంద్రబాబు ఇంటి గేట్లకు తాళ్లు కట్టిన సంగతి జగన్ మర్చిపోయారా.? తిరుపతి విమానాశ్రయం లో చంద్రబాబు కూర్చుని ధర్నా చేసిన సంగతి జగన్ మర్చిపోయారా? లోకేష్ ఎన్ని సార్లు అడ్డుకోలేదు..? నేను ఎన్నోసార్లు టూ వీలర్ పై తిరిగా.. నా కార్ ఆపితే టూ వీలర్ లో తిరిగా.. ఆంక్షలను విధించానా అని అమాయకంగా జగన్ మాట్లాడుతున్నారు అంటూ జగన్‌పై ఫైర్ అయ్యారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
