NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నేడు విచారణ..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు కృష్ణాజిల్లా పోలీసులు.. మరోవైపు.. వంశీ అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి.. వంశీని అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.. ఈ నేపథ్యంలో.. హైకోర్టును ఆశ్రయించారు వల్లభనేని..

Read Also: New Movies Release: ఒకేరోజు 4 సినిమాలు రిలీజ్.. మరి మీ ఛాయిస్.?

అయితే, ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయిన సందర్భంలో ఆయన్ని కూడా అరెస్ట్‌ చేశారంటూ హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్‌ ఇచ్చుకోవావాల్సి వచ్చింది. అయితే, ఈ ప్రచార సమయంలోనే వంశీ చుట్టూ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కచ్చితంగా అరెస్టు చేయాల్సిన వ్యక్తి వంశీ అని, అధికారంలో ఉన్నపుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడన్నారు అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.. ఇక, వంశీపై నమోదైన కేసులో న్యాయపరంగా ముందుకు వెళ్తారని, టీడీపీ నేతలే ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు కొట్టిపారేశారు.. మరోవైపు.. టీడీపీ టార్గెట్ లిస్ట్‌ టాప్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉందంటూ ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌ విస్తృత ప్రచారం సాగుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విచక్షణ మరిచి వంశీ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అంటున్నారు.. వాస్తవానికి వంశీ తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువకాలం రాజకీయం చేశారు. 2009లో విజయవాడ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీదే వరుసగా రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు.. రెండోసారి గెలిచాక టీడీపీని వదిలి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి జై కొట్టారు.. ఇక, అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. ఓ దశలో శృతిమించి… నైతిక విలువలు కూడా మర్చిపోయి మాట్లాడటం వల్లే వంశీ పేరు హిట్‌ లిస్ట్‌లో చేరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.